బ్రహ్మ ,విష్షు, మహేశ్వరులు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లా?(ఒక యోగితో గతంలో జరిగిన సంవాదం)
పూర్వం ఒక యోగి ఓ పదేండ్లు హిమాలయాల్లో సాధన చేసి తాను రాగద్వేషాలను,కోప తాపాలకు అతీతం అయ్యి ప్రస్తుతం తాను ఒక మహోన్నత యోగిగా మారాను అని ఒక సభలో చెప్పుకు వచ్చాడట.ఆ సభలో ఉపాన్యాసం విన్న ఒక సంసారి తన పదేళ్ళకొడుకు తన మాట వినడం లేదని , వాడిని రెండురోజులు దగ్గర ఉంచుకుని మార్చమని ప్రాదేయపడితే ఆ యోగి సరేసని అ పదేళ్ళ పిల్లాడిని తన దగ్గర 2రోజులు ఉంచుకున్నాడట.2రోజుల తరువాత పిల్లాడి చేస్టలకు, మాటలకు,విసిగించే లక్షణాలకు ఆయోగి హిమాలయ్యాల్లోకి వెళ్ళేముందు ఏ స్టేజిలో ఉన్నాడో అదే స్టేజికి వచ్చి , పిల్లాడు మాట్లాడితే చాలు కస్పు బుస్సుమనడం,కోపతాపాలతో ఎగిరపడటం అన్ని చేసాడట.పిల్లాడి తండ్రి వచ్చి పిల్లాడిని తీసుకెళుతుంటే ఏం మాయ ఉందంటి మీ బాబులో , నా పదేళ్ళ తపస్పును 2రోజుల్లో ఎగరగొట్టాడు అని వాపోయడట..సంసారి సమాధానం చెప్పలేక పోయాడు కాని పైనున్న స్ర్కిన్ ప్లే రైటర్ (గాడ్) మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడట. జనానికి చెప్పడానికి థియరిగా అంతా బాగానే ఉంటుంది, మీరు ఎంతవరకు స్వయంగా ఆచరిస్తున్నారనేదే నా ఘాటు సమాధానాల అసలు సిసలు పరమార్థం. 33 శాతం నెగేటివ్ ఉండాలి, దానిని కూడా ప్రీతితో స్వీకరించాలి అనే మీరు నాలాంటి వాడెవడో ఒకడు నెగెటీవ్ పర్సన్ తగిలి కాస్తా ఘాటుగా విమర్షించగానే ఠారెత్తిపోయి ఇక నాకు మెసేజ్ లు పంపకు నేను చదవను అన్నారు.మరి ఏమైంది మీ సాధన ? వేల మందికి థీయరిటికల్ గా మాత్రం ఎదుటి మనుష్యులు అలాంటి ఇబ్బందులు పెడితే వాడిని కూడా మనస్పూర్తిగా ప్రేమించి, వాడికి ప్రేమ ఎనర్జి పంపంచండి , లోన అంతరంలో స్రుష్టి జరుగుతుంటే ,బాహ్యంలో కూడా మార్పు వస్తుంది , ఆవతలి వ్యక్తినుండి వచ్చే ఇబ్బందులు కూడా తొలిగిపోతాయి అని చక్కగా ఉపన్యాసాల్లో చెప్పిన మీరు అదే నా విషయంలో మాత్రం ఎందుకు పాటించలేకపోయారు.మీ సహనాన్ని పరిక్షించే ఉద్దశ్యంతో మాత్రమే నిన్న అంత ఘాటుగా నువ్వని నీకేం తెలియదని నెగేటివ్ గా మెసేజ్ పంపాను.మీరు మాత్రం దేవుడ్ని, క్లాసు వింటున్న ప్రేక్షకుల్ని నెగేటీవ్ గా మాత్రం వాడు,వీడు , వెదవలు,అందుకే ఇంత దరిద్రం అంటూ తెగ విమర్షించ వచ్చు. అదే మీపట్ల నెగేటీవ్ గా విమర్షలు వస్తే మాత్రం అది ఏమాత్రం భరించలేరు.ఇక నాకు మెసేజ్ లు పంపవద్దు అని క్లియర్ గా చెప్పేస్తారు.మీరు చెప్పదలుచుకున్నది మాత్రం ఆడియో ఫైల్స్ ను మేసేజ్ ల రూపంలో పంపవచ్చు.ఎదుటి వాడు అదే పని చేస్తే మాత్రం మీరు సహించలేరు..ఇక మీకు ఎక్కడుంది బ్యాలెన్స్ . మీ మాటల్లోనే చెప్పాలంటే మీకు 45 ఏళ్ళు వచ్చినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నారు కాబట్టే మీరు ఇంత దరిద్రంగా ఉన్నారని చెపుతున్న.పిల్లల నుండి, భార్య నుండి నెగేటివ్ విమర్సలు వస్తే ఎలా ఉంటుందో తెలియదు, మీకు ఆవిషయంలో స్వానుభవం, జ్ఞానం లేదు కాబట్టే మీరు ఇందరిని విమర్షిస్తున్నారు. పైగా ఏమన్నా గట్టిగా మాట్లాడితే తండ్రే కదా , గుండెల మీద అడుకునే పిల్లాడిని అనే అపరిపక్వ సమాదానాలు.గుండెల మీద అడుకునే పిల్లాడు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది , ఆ టైమ్ లో తండ్రిని పట్టుకుని రారా పోరా అని కూడా తిడుతుంటారు, అలా అడుకుని తిట్టి, తన్నే ఏజ్ వరకు మాత్రమే అది పర్మిట్.అది దాటిన తరువాత ఎదురు వాతలు తండ్రి నుండి మొదలవుతాయి.ఎదురు తిరిగి తిట్టే పిల్లలను నాకు తెలిసి ఏ తల్లి తండ్రులు కూడా సహించరు.పరమాత్మ కూడా అంతే. నక్షత్రాల చుట్టు నియమిత కక్షల్లో గ్రహాలు తిరిగేంతే వరకే ఆ నక్షత్రం భాద్యత.నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్లు నేను తిడుతా, తిరుగుతా అంటే అంటే దాని గ్రహం బతుకైనా , మనిషి బతుకైనా అంతే.తల్లి తండ్రులను ఎదురించి గడిపే స్వతంత్ర జీవితం అనేది స్వంతంగా పెట్టుకున్న వ్యాపారం లాంటిది.దాంట్లో సక్సెస్ రేషియో సగటున 25శాతం మాత్రమే.మిగితా 75 శాతం నష్టాల పడి క్లోస్ అయ్యేవే.అదే ప్రబుత్వ ఉద్యోగంలో మాత్రం నష్టం ఎందుకు ఉండదంటే తండ్రిగా ఆ ప్రభుత్వం ఎన్ని నష్టాలు వచ్చినా అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు కాబట్టి , ప్రభుత్వ ఉద్యోగికి ఏ చీకు చింతా లేదు.అందుకే ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత క్రేజి….
దైవం నిర్గుణం , ఏ గుణాలు అంటని వాడు,త్రిగుణాలు 33:33:33 శాతం రేషియోలో 100శాతం లోబడి సమాన స్థాయిలో ఉంటాయి.మనం కూడా ఆ స్తితికి చేరాలంటే మనలో కూడా ఆ గుణాలు అదే మాదిరిగా ఉండాలి , రాగ ద్వేషాలకు అతీతంగా ఎదగాలి అని.మూల థియరి బాగుంది, మీరు చెప్పే ఉదాహరణలే విషయాన్ని చెడగొడుతున్నాయి.బ్రహ్మ ,విష్షు,మహేశ్వరులకు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ స్థితులకు అపాదించిన మీరు కావాలంటే అణువునుండి ఎలక్ర్టాన్ ను తీసేయండి అణువుకు ఏంజరుగుతుందే మనిషి జీవితంలో నెగేటివ్ ను తీసివేస్తే అదే జరుగుతుందని చెపుతున్నారు. సైన్స్ ఉదాహరణలు చెప్పేప్పుడు ఆ సైన్స్ ను బాగా చదువుకుని ఉండాలి.ఉదాహరణలు చెప్పేప్పుడు విషయం లోపలికి వెళ్ళకుంటే ఇలాగే నాలాంటి వాడు ఒకడు తప్పనిసరిగా తగులుతుంటాడు.నాది అర్ట్స్ గ్రూపు హిష్టరి చదువుకున్న కూడా సైన్స్ ను అంతకంటే ఇష్టంగా చదివాను.బ్రహ్మ ,విష్షు,మహేశ్వరులు అణువులోని న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లు అయితే మీ రు చెప్పే ఉదాహరణ టోటల్ 90 శాతం రాంగే..నేను నిరూపిస్తాను……..ఈ విశ్యంలో ప్రాథమిక అణువు హైడ్రోజన్. దాంట్లో కేంద్రకంలో పాజిటివ్ విద్యుత్ కల ఒక ప్రోటాన్, నెగటీవ్ విద్యుత్ కల ఒక ఎలక్ట్నాన్ మాత్రమే ఉన్నాయి.హైడ్రోజన్ అణువులో న్యూట్రాన్ లేనే లేదు.న్యూట్రాన్ మీ లెక్క ప్రకారం బ్రహ్మో, విష్ణువో అయితే అణువు లో వీరి స్థానం ఎక్కడ? 2వ అణువు అయిన హీలియం లోమాత్రమే ఇక కొత్తగా న్యూట్రాన్ వచ్చి చేరింది.హీలియంలో రెండు ప్రోటాన్లు,రెండు న్యూట్టాన్లు,రెండు ఎలక్ట్రాన్ లు ఉన్నాయి.ఈ యునివర్స్ నిండా 90శాతం అసలు న్యూట్రాన్ లేనే లేని హైడ్రోజనే విశ్వమంతా వ్యాపించి ఉన్నది.సూర్యుడిలో కూడా 99శాతం ఉన్నది హైడ్రోజనే.విశ్వం నిండి హీలియం కూడా మరో 9శాతం ఉంది,దాన్ని కలుపుకుంటే మొత్తం విశ్వం, స్రుస్టి లో 99శాతం ఈ రెండు అణువులే వ్యాపించి ఉన్నాయి.మిగితా 1శాతమే బంగారం,ఆక్సిజన్,సీనం,ఇనుము,మరి ఇతర వేలకొద్ది ఇతర కాంసౌండ్ అణువులు.అణువుల్లో పై మూడు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లే కాకుండా ఇతరాత్ర అణువలో మిజాన్లు,క్వార్కులు అని రకరకాల పేర్లతోని 200 ఫైగా పార్టికల్స్ ఉన్నాయి.అవిభాజ్యమైన అణువుగా చెప్పకునే దాని అసలు రూపం 200 పైగా శకలాలతో నిండి ఉంది. ఒక అణువులో 99.99 శాతం ప్రోటాన్ లేదా న్యూట్రాన్ తో కలగలిపి ఉంటే కేవలం 0.1 శాతమే ఎలక్ర్టాన్ దగ్గర ఉన్నది. త్రిగుణాలకు న్యూట్రాన్,ప్రోటాన్,ఎలాక్ట్రాన్ లు 33:33:33 శాతం రేషియోలో సమత్వ స్తితిలో ఉంటాయనే ఉదాహరణలు ఇక్కడ సెట్ కావు. పదార్థం కున్న ఘన ,ద్రవ,వాయు స్థితి కాకుండా నాలుగవ స్థితిలో కేవలం ప్లాస్మాగా మాత్రమే ఉంటుంది.సూర్యుడిలో ఉన్నది ప్లాస్మా స్థితి మాత్రమే. ప్లాస్మా స్థితిలో అణువు లోని భాగాలు అంటే ప్రోటాన్ , ఎలక్ట్రాన్ లు విడిగా ఉండలేవు.వాటి ఉనికే అక్కడ లేదు.పరమాత్మ నిర్గ్గుణుడు అంటే ప్లాస్మా స్థితిలో ఉండే పదార్థం లాంటి వాడన్న ఉదాహరణ ఇక్కడ మీరు చెప్పాలి.ప్లాస్మాస్థితిలోని లక్షల కొలది సెల్సియస్ హీట్ లో లో ఏ ప్రోటాన్ లు, ఎలక్ట్రాన్ లు, న్యూట్రాన్స్ లు విడిగా ఉండలేవు,వాటి ఉనికికే అక్కడ మనుగడ లేదు కాబట్టి. సూర్య కుటుంబం లేదా మరే ఇతర నక్షత్ర కుటుంబంలోనైనా 99శాతం ఒక్క ఆ నక్షత్రంలోనే ఉంటుంది.మిగితా ఆ ఒక్క శాతమే ఇతర గ్రహాలు,తోకచుక్కలన్ని.పరమాత్మ సూర్యడు.నిర్గుణుడు,కాని అక్కడ తన జీవితాన్ని,జీవిత మాధుర్యాలను ,జీవిత అనుభవాలను అనుభవించలేడు కాబట్టి(తన వేడే తనకు శాపం,తన నిర్గణమే, తన ప్లాస్మా స్థితే తనకు శాపం) దూరంగా గ్రహాలను , గ్రహాల మీద జీవితాలను ఏర్పాటు చేసి ఆయా జీవితాలు నడవడానికి అవసరమైన ప్రాణశక్తిని తిరిగి తన కిరణాలు వేడి ద్వారనే అందచేస్తూ , మాష్టర్ కంట్రోలర్ గా అందరి జీవితాల అనుభవాలను పొందుతున్నాడు అంటే మాత్రమే, ఆలాంటి ఉదాహరణ మాత్రమే సత్యం దరిదాపుల్లోకి సరిపోతుంది……………………………….మీరు చెప్పే ఉదాహరణలు సరిగా లేకున్నా మీరు చెప్పే టాపిక్ ,ఇన్నర్ ఉద్దేశ్యం మాత్రం క్లియర్..దాన్ని బయటకు సరైన ఉదాహరణలతో వ్యక్త పరుచలేకపోతున్నారు…..న్యూ ఎనర్జి ..టాబోయిస్ జ్ఞానం …నేను చదివిన వేల వేల పుస్తకాల్లో నా అన్వేషణకు, మాష్టర్ సి.వి.వి.జ్ఞానం తరువాత దాదాపు సరిహద్దుల వరకు తీసుకు వచ్చింది టాబోయిస్ జ్ఞానమే.2002లోనే చదివాను.కర్మలు,జీవితాలు,శిక్షలు,భూమి మీద బాధలు,జన్మలు, కర్మ సిద్దాంతం అన్ని బాగానే ఉన్నాయి , కాని ఎందుకు అసలు జీవితం,జన్మ అనే దానికి సత్యం అంచుల వరకు తీసుకు వచ్చిన జ్ఞానం టాబోయిస్ జ్ఞానమే..రామ్తా, సేత్ లు అన్నిటిని ఫిల్టర్ చేసాను.సత్వం దరిదాపుల్లో ఉన్నది టాబోయిస్ జ్ఞానమే.ఈ మద్య రిలీజైన పెళ్ళిచూపులు సినిమాలో ఒక పవర్ పుల్ డైలాగ్ ఉంటుంది.ఒక తాగుబోతు ఒక పార్టిలో తనకు ఎదురైనా పెద్దమనిషి నువ్వేం చేస్తున్నావడని అడిగితే..చచ్చింది గొర్రె అని తనలో తాను అనుకుని, బయటికి మాత్రం ఆ పెద్దమనిషితో ’నా చావు నేను చస్తా.నీకెందుకు’ అని కొద్దిగా గ్యాప్ ఇస్తాడు.అవతలి మనిషి షాక్ కాగ సమాజానికి పనికి వచ్చే అలాంటి టైటిల్ తో పుస్తకం రాస్తున్న అని చెపుతాడు.సినిమా హలంతా కామెడితో ఘొల్లు మంటుంది.టాబోయిస్ చెప్పిన దాంట్లో కూడా అంతిమ నియరెస్ట్ సత్యం కూడా దాదాపు ఇదే..చక్కగా హాయిగా అగ్ని గోగ వెనుకాల ఉండక, నా చావు నేను చస్తానని గొడ ఇవతలకి దూకి వచ్చి , సగుణాత్మకంగా ఆత్మగా,జీవిత్మాగా జీవితాలను అనుభవించడమే నా చావు నేను చస్తా అని దానికి మరో కోణం..బుద్దుడు లాంటి పెద్దమనిషి కూడా జీవితం ,దుంఖమయం,దాని నివారణ అంటూ చెప్పుకొచ్చాడే అసలు జీవిత మూలల లోతుల వరకు వెళ్ళలేదు. .మాష్టర్ సి.వి.వి.జ్ఞానం , టాబోయిస్ జ్ఞానం మాత్రమే నేను అన్వేశిస్తున్న అంతిమ సత్యానికి దరిదాపుల్లో ఇప్పటివరకు కనపడ్డాయి.వాటిని నా స్వీయానుభవం,జ్ఞానం తో అనుబూతి చెంది తెలుసుకోవడమే , తదనంతరం శష బిషలు లేకుండా బల్ల గుద్ది నేను పొందిన జ్ఞానం ను పరిపూర్ణ ఉదాహారణ,లాజిక్ లతో , సైన్స్ అంతటి ఖచ్చిత నిరూపణలతో ఆ నిర్గుణ పరమాత్మను ప్రపంచానికి ప్రకటితం చేయడమే నా అంతిమ జీవిత లక్ష్యం.అందుకు తగిన జీవితానుభవాలనచ్చిన ఆ పరమత్మకు సదా వినయ, విదేయలతో, ఆ జీవితానుభావాలను ఇచ్చిన దైవం పట్ల అనంద భరితుడనై..సెలవు తీసుకుంటూ….ప్రేమతో . రవీందర్.