google.com, pub-9178986026795692, DIRECT, f08c47fec0942fa0

నరకం చూపిస్తున్న మియాపూర్ –గండిమైసమ్మ రోడ్

నరకం చూపిస్తున్న మియాపూర్ –గండిమైసమ్మ రోడ్

మియాపూర్ నుండి గండిమైసమ్మ రోడ్, నిత్యం వేలమంది ప్రయాణించే దారి. కరోనా తరువాత నుండి ఈ రోడ్ చుట్టుపక్కల కాలనీలు, హైరైస్ బిల్డింగ్స్ పెద్ద ఎత్తున వెలియడంతో ఈ రోడ్ లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. గత సంవత్సర కాలంగా 135 కోట్ల ఖర్చుతో మియాపూర్–గండిమైసమ్మ దారిని 4 వరుసల నుండి 6 వరుసల దారికి విస్తరిస్తున్నారు. మాగ్జిమం పనులు పూర్తి కావచ్చాయి.

ఇటీవల వెడల్పు చేసిన రోడ్లతో బాచుపల్లి నుండి ప్రగతి నగర్ కమాన దాటిన తరువాత డాలర్ డ్రీమ్స్ కాలనీ వరకు ట్రాఫిక్ స్మూత్ గానే వెళుతుంది. కాని అక్కడినుండి పట్టణ ప్రాంత అటవి దూలపల్లిలోని అడవి మొదలవుతుంది. ఇక్కడ 2 కిలోమీటర్ల పాటు ఉన్న అటవి ఏరియా కేవలం రెండు వరుసలతో హెవి ట్రాఫిక్ తో ఉండి, ఉదయం కాలేజీలకు, ఆఫీసులకు వెళ్ళేవారికి నిత్యం నరకం చూపిస్తుంది.

గండిమైసమ్మ ట్రాఫిక్ జామ్ రోడ్

ఈ 2.3 కిలోమీటర్ల రోడ్ ప్రాంతాన్ని విస్తరించేందుకు అటవి శాఖ హెచ్‌ఎండీఏకు అప్పగిస్తేనే, 6 వరుసల రోడ్‌కు తక్షణం విస్తరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరకుతుంది. అటవి శాఖ మీనమేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తుండడంతో ఈ రోడ్ మీద ప్రయాణించే ప్రయాణికుల బాధలు చెప్పనలవి కావు.

ప్రగతినగర్ ,బాచుపల్లి రూట్లో నుండి గండిమైసమ్మ రూట్లో స్కూల్స్ కాలేజిలకు వెళ్ళే బస్ లు, గండిమైసమ్మ రూట్లో నుండి ప్రగతి నగర్,బాచుపల్లి ల మీదుగా హైటెక్ సిటి కి వెళ్ళే సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు, ఇతర ఆఫీస్ లకు వెళ్ళే ఉద్యోగస్తులు. ఓకే సమయంలో ఈ రూట్లో ప్రయాణిస్తుండండో సమస్య మరింత జటిలమవుతుంది

ఈ రోడ్‌ను 6 వరుసలుగా విస్తరించే ముందు కనీసం రోడ్‌కు ఇరువైపుల ప్రస్తుతం ఉన్న 2 వరుసల రోడ్‌కు సమాంతరంగా స్వల్ప ఖర్చుతో మొరం, మట్టి పోసి లెవలింగ్ చేయిస్తే కనీసం బైక్‌లు, ఆటోలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రోడ్ వెడల్పు కార్యక్రమం కంటే ముందుగా ఇలాంటి తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటే వాహనదారుల కష్టాలు కొంత మేరకైనా తగ్గుతాయి.

బాచుపల్లి–గండిమైసమ్మ రోడ్ పై ఉన్న సమస్య ఒక్క ట్రాఫిక్ రద్దీ మాత్రమే కాదు. రోడ్ విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో లైటింగ్ సదుపాయాలు లేకపోవడం, గుంతలు ఏర్పడటం, వర్షాకాలంలో నీరు నిల్వవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా స్కూల్ బస్సులు, కాలేజీ వాహనాలు, ఐటీ కంపెనీల షటిల్ బస్సులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతాయి. ఒకవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు ప్రమాదాల భయం, ప్రయాణికులకు నిజంగా నరకానుభవమే.

బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ రోడ్ ప్రాంతం చుట్టుపక్కల భారీ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ జరుగుతోంది. కొత్త హైరైస్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య కేంద్రాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నిర్మాణ ప్రాజెక్టుల వలన భారీ ట్రక్కులు, బోరింగ్ లారీలు రోజంతా రోడ్లపై తిరుగుతుంటాయి. ఫలితంగా చిన్న వాహనాలకు ప్రయాణం మరింత కష్టతరమవుతోంది.

ప్రజా సంఘాలు, స్థానిక కాలనీ సంఘాలు ఇప్పటికే పలుమార్లు HMDA, GHMC, అటవీశాఖల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన పరిష్కారం కనబడలేదు. ఒకవైపు అభివృద్ధి పేరుతో కొత్త కాలనీలు వస్తుంటే, మరోవైపు ఈ రోడ్ సమస్య పరిష్కారం కాకపోవడం నిజంగా వింతగా ఉంది.

వాహనదారులు నిత్యం గొణుక్కుంటున్న విషయం ఏమంటే – “ఈ రెండు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ కోసం ఇంతకాలం ఆలస్యం ఎందుకు? మిగతా రోడ్ల నిర్మాణం సాఫీగా జరుగుతుంటే, ఇక్కడ మాత్రమే అటవీశాఖ అడ్డంకులు ఎందుకు?” అని. దీనికి అటవి శాఖనుండి సమాధానం వచ్చే వరకు ఈ రోడ్డు వినియోగదారులు నిత్యం నరకానుభవం పడుతూనే ఉండాల్సిందే.

ప్రభుత్వం, అటవీశాఖ, HMDA ఒకే టేబుల్ మీద కూర్చుని స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రాబోయే రెండేళ్లలో ఈ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిపోతుంది.

విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి ప్రయాణించడం వల్ల సమస్య మరింత జటిలం

ప్రగతినగర్, బాచుపల్లి రూట్‌ల నుండి గండిమైసమ్మ రోడ్డులోకి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో తిరుగుతాయి. అదే సమయంలో గండిమైసమ్మ రూట్‌ నుండి ప్రగతినగర్, బాచుపల్లి మీదుగా హైటెక్ సిటీకి వెళ్ళే సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, ఇతర ఆఫీస్ ఉద్యోగులు కూడా తమ వాహనాలతో బయలుదేరుతారు.

రెండు వర్గాల ప్రయాణికులు ఒకేసారి రోడ్డు మీదకు రావడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, అలాగే సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఈ రూట్ పూర్తిగా స్థంభించినట్టే ఉంటుంది.స్కూల్ బస్సులు,కాలేజీ బస్సులు: పెద్ద పెద్ద ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఈ రూట్‌లో ఉండటంతో, వాటి బస్సులు వరుసగా వస్తూ రోడ్డు మీద గందరగోళం సృష్టిస్తాయి. సాఫ్ట్‌వేర్ & ఇతర ఆఫీస్ ఉద్యోగులు IT షటిల్ బస్సులు, కార్లు, బైక్‌లు అంతా ఒకేసారి రావడంతో రోడ్డు పద్మవ్యూహంలా మారిపోతుంది.

ఫలితంగా, సాధారణంగా 15–20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణం, పీక అవర్స్‌లో గంటకు పైగా పడుతోంది. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు ఆలస్యంగా చేరడం, ఉద్యోగులు టైమ్‌కి ఆఫీస్ హాజరు కాకపోవడం ఇప్పుడు రొజూ జరిగే వ్యవహారమే అయిపోయింది.

అటవీశాఖ అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?

బాచుపల్లి–గండిమైసమ్మ రోడ్ విస్తరణలో ప్రధాన అడ్డంకి దూలపల్లి అటవీ ప్రాంతం. రోడ్డు విస్తరించాలంటే అటవీ భూమిని ఆక్రమించక తప్పదు. కానీ అటవీ భూమి వినియోగంపై భారత ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం – 1980 (Forest Conservation Act, 1980) కఠిన నియమాలు ఉన్నాయి.

  1. చట్టపరమైన అనుమతుల ప్రక్రియ
    • అటవీ ప్రాంతంలో ఉన్న ఒక్క చెట్టునైనా నరకాలంటే ముందుగా ప్రాథమిక సర్వే, పర్యావరణ ప్రభావ నివేదిక (EIA), కంపెన్సేటరీ అఫారెస్టేషన్ (Compensatory Afforestation) ప్లాన్ తయారు చేయాలి.
    • ఈ పత్రాలు రాష్ట్ర అటవీశాఖ నుంచి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoEF) వరకు వెళ్లి, అనుమతి పొందాలి. ఈ మొత్తం ప్రక్రియ నెలల తరబడి సాగుతుంది.
  2. చెట్ల నరికివేత & ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధి
    • రోడ్డు కోసం చెట్లు నరికితే, అదే సంఖ్యలో చెట్లను మరెక్కడైనా నాటాలని చట్టం చెబుతుంది. దీనిని CA Land (Compensatory Afforestation Land) అంటారు.
    • సరైన భూమి గుర్తించడం, నిధులు కేటాయించడం, కొత్త అటవీ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయడం చాలా సమయం తీసుకుంటుంది.
error: Content is protected !!