
మొత్తం ఆర్సీబీ యాజమాన్యం వల్లే.. పోలీసులు ఏం దేవుళ్లు కాదు: తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కీలక వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీ యాజమాన్యమేనని.. దీనికి వాళ్లే బాధ్యత వహించాలని పేర్కొంది. ఐపీఎల్ 18 విజేతగా ఆర్సీబీ నిలవడంతో 2025, జూన్ 4న బెంగుళూరులో విక్టరీ పరేడ్‌తో పాటు చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11…