ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025 చట్టంగా మారింది – రియల్ మనీ గేమ్స్‌కు ఇక గుడ్ బై.
భారత ప్రభుత్వం రియల్ మనీ ఆన్‌లైన్ గేమ్స్‌పై పూర్తిగా నిషేధం విధించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన “ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025” ఇప్పుడు చట్టంగా మారింది. డ్రీమ్11, ఎం.పి.ఎల్, జూపీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫార్ములు తమ రియల్ మనీ ఆపరేషన్లను నిలిపివేయగా, పరిశ్రమలో కలకలం రేగింది.