Dear Sir/Madam, వైష్ణోదేవి  11-3-2023, యాత్రకు శ్రీటూర్స్ రవీందర్ స్వాగతం. Call-8985246542. / 9290177401

ఈ యాత్రకు మొత్తం 41మంది యాత్రికులం వెళుతున్నాం.

ప్రయాణంలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ,సూచనలు..దిగువన ప్రతి వివరంగా జాగ్రత్తగా చదవండి.

*) ఏయిర్ పోర్టుకు రావడం. ఈ యాత్రకు బుక్ చేసుకున్నవారందరు  11-3-2022 న  షంషాబాదు ఏయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో ఎంట్రినెంబర్.3  వద్దకు ఉదయం 7.30 గంటలకు తప్పనిసరిగా రావలెను.అంతా ఉదయం ఇంటిదగ్గర స్నానం చేసి బయలుదేరవలెను. ఉదయం ఇంటిదగ్గరనుండి  వచ్చేముందే టిఫిన్ చేసి రాగలరు. మధ్యహ్నం ఫ్లైట్ లో మీల్స్ ఉంటుంది(విస్తార ఫ్లైట్ లో బుక్ అయిన వారికి మాత్రమే) విడిగా ఫ్లైట్ బుక్ చేసుకున్నవారు హోంపుడ్ తెచ్చుకుని ఫ్లైట్ లో లేదా ఏయిర్ పోర్టులో తినవచ్చును. ఏయిర్ పోర్టుకు  వచ్చాక నాకు కాల్ చేసి చార్టు లో మీ హజరు వేసుకోగలరు. (కారు,క్యాబ్,బస్ దేంట్లో వచ్చిన కూడా ఈ పాయింట్ వరకు డైరెక్టుగా రావచ్చును)  (విస్తారా ఫ్లైట్ లో ఉదయం 10గంటల ఫ్లైట్ కు  బుక్ అయిన వారికి మాత్రమే ఈ టైం. మరికొందరు విడిగా బుక్ చేసుకున్నారు.వారు మీ మీ ఫ్లైట్ టైమింగ్స్ తగ్గట్లగా ఖచ్చితంగా 2నుండి 3గంటల ముందు ఏయిర్ పోర్టులో మీ విమానయాన కౌంటర్ లో రిపోర్టు చేయాలి. ఏయిర్ పోర్టుకు రావడానికి మీ స్వంత కారులో కాని లేదా  మీరు స్వంతంగా క్యాబ్ బుక్ చేసుకుని కాని లేదా RTC Airport busses from JBS,JNTU,MIYAPUR,BHEL,UPPAL etc పాయింట్లనుండి బయలుదేరే బస్సల్లో కాని ఎవరి వీలు ప్రకారం వారు రావచ్చు. కాని ఖచ్చితంగా ఉదయం 7.30 గంటలకు ఈ పాయింటకు చేరుకోవలనెను.చివరలో శ్రీనివాస్ గారిది ఉదయం 5గంటల ఫ్లైట్ కు బుక్ అయ్యింది , వారు ఖచ్చితంగా ఉదయం 3గంటలకే ఏయిర్ పోర్టులో ఇండిగో ఫ్లైట్ కౌంటర్ లో రిపోర్టు చేయాలి. ఎంట్రినెం.3నుండి లోనకు వెళ్ళెప్పుడు మీ మొబైల్ లో ఉన్న ఎలక్ట్రానిక్ ఈ టికెట్ తో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపించి లోనకు వెళ్ళవలెను. (..అధార్ కార్డు మస్ట్  ఆధార్ కార్డు ఒరిజినల్ తెచ్చుకోకుంటే మీకు ఏయిర్ పోర్టులోకే వెళ్ళడానికి అనుమతి ఉండదు.)మొబైల్ లో ఉన్న టికెట్ చూపించడం కన్ ఫ్యూజన్ గా ఉంటే   మీకు పంపించిన ఫ్లైట్ టికెట్స్ ను ప్రింట్ తీసుకోండి.   Hyderabad to Delhi కి కొందరు ఇండిగో,మరికొందరు విస్తారా ఫ్లైట్ ద్వారా బుకింగ్ అయినది.విస్తారాలో బుక్ అయిన వారందరు విస్తారా ఫ్లైట్ కౌంటర్ లో రిపోర్టు చేయండి. ఏయిర్ పోర్టు లోపలికి వెళ్లాక మీ టికెట్ చూయించి ఇక్కడే బోర్డింగ్ పాస్ తీసుకోవలెను.ఆలస్యం లేకుండా ముందుగా వచ్చిన వారు అదనం ఖర్చులేకుండా రిక్వెస్ట్ మీద విండో సీట్స్ కూడా పొందవచ్చును. బోర్డింగ్ పాస్ తీసుకుని, సెక్యూరిటి చెకింగ్ చేసుకుని అనంతరం మీకు బోర్డింగ్ పాస్ మీద ఇచ్చిన గేటు దగ్గరకు వెళ్ళి ఫ్లైట్ ఎక్కవలెను.బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా అని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా సెక్యూరిటి దగ్గర చెకింగ్ ఫాస్ట్ గా చేయించుకుని మీ బోర్డింగ్ పాస్ మీద ఇచ్చిన గేట్ దగ్గరకు వెళ్ళవలెను.ఫ్లైట్ లో కూర్చునేవరకు  మీ స్వంత బాధ్యతమీదనే కూర్చోవలెను.అంత బాధ్యతయుతంగా ఉండి మీరు ఫ్లైట్లో కూర్చోవలెను. ఫ్లైట్ లో కూర్చునేవరకు మీ స్వంత బాధ్యత మీదనే ఫ్లైట్ ఎక్కండి.

. టూర్ కు వచ్చేప్పుడు విలువైన బంగారు అభరణాలు ఏవి తెచ్చుకోవద్దు,ఇంట్లో పెట్టుకుని రాగలరు. ఏమైనా వాడుతున్నట్లయితే మీరెగ్యులర్ మెడిసిన్స్ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఉదయం అంతా ఇంట్లో స్నానం చేసే బయలు దేరవలెను.ఎందుకంటే అమ్రుత్ సర్ లో దిగాక హోటల్ రూం వెళ్ళడం ఉండదు, గోల్డెన్ టెంపుల్,వాఘా బార్డర్ చూసి హిమాచల్ ప్రదేశ్. నైట్ చింతపూర్ణిమ కు వెళ్ళాకనే హోటల్ రూం ఉంటుంది.

*) లగేజి,బట్టల జాగ్రత్తలు-కొందరు  6నెలలపాటు USA కు వెళ్ళేమాదరి  పెద్ద పెద్ద బ్యాగులు, హెవి సూట్ కేసులు తెచ్చుకుంటారు.అలా కాకుండా లైట్ లగేజి 10 కిలోలు దాటకుండా మీ బ్యాగు మీరు మోసుకునేంత మాత్రమే తెచ్చుకోవాలి. ప్రయాణంలో బస్ నుండి హోటల్ రూంకువెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు ,  ప్రతిసారి  ఎవరి లగేజి వారే ఖచ్చితంగా మోసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.బ్యాగులో ఖాళి ఉంచుకోవడం ద్వారా మద్యలో ఏదైనా షాపింగ్ చేసినకూడా సర్దుకోవచ్చు. ఏదైనా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుని విడిచిన బట్టలను ఆ కవర్ లో వేసుకుంటే సులభంగా ఉంటుంది.ఈ విషయంలో క్లారిటి  లేకుండా కేవలం విడిచిన బట్టలకోసమని రెండవ బ్యాగు తెచ్చుకునేవారుంటారు,ఇది అనసవర ప్రయాస. 5 రోజుల టూర్ లో కేవలం 4 జతల బట్టలు తెచ్చుకుంటే చాలు.దాంతో టవల్,సోప్స్,బ్రష్,టూత్ పేస్టు లాంటి మినిమం లగేజి… బోర్డింగ్ పాస్ తీసుకునేప్పుడు  మీలగేజి చెకిన్ లగేజికి ఇవ్వండి.(ఒకవేళ 7 కిలోల బరువే ఉంటే మీతోపాటే ఫ్లైట్ లోకి తీసుకెళ్ళి పైన లగేజి క్యారియర్ లో మీ సీటు పైనే పెట్టుకోవచ్చు.)మీరు చెకిన్ లగేజి ఇచ్చినందుకు గుర్తింపుగా మీ బోర్డింగ్ పాస్ వెనుక స్టిక్కర్ అతికించి ఇస్తారు.అదే ఐ.డి.గల  స్టిక్కర్ మీ లగేజి బ్యాగుకు కూడా ఉంటుంది. ఏయిర్ పోర్టులో దిగినాక మీ లగేజి ఏ బెల్ట్ మీదకు వస్తుందో చూసుకుని అక్కడ లగేజి తిరిగి తీసుకోవచ్చును.

*)టిఫిన్,భోజనం జాగ్రత్తలు. ఉదయం ఇంటిదగ్గరనుండి  వచ్చేముందే టిఫిన్ చేసి రాగలరు. మధ్యహ్నం ఫ్లైట్ లో మీల్స్ ఉంటుంది(విస్తార ఫ్లైట్ లో బుక్ అయిన వారికి మాత్రమే) విడిగా ఫ్లైట్ బుక్ చేసుకున్నవారు హోంపుడ్ తెచ్చుకుని ఫ్లైట్ లో లేదా ఏయిర్ పోర్టులో తినవచ్చును)టూర్ లో తిరిగేప్పుడు  టూర్ లో మనం తిరిగే ప్రదేశాల్లో ఆ సమయానికి ఎక్కడ హోటల్ ఉంటే అక్కడే తినడం జరుగుతుంది.

*) హోటల్ రూం జాగ్రత్తలు, అందరికి రూంలు ముందుగానే బుక్ చేయబడ్డాయి. 1వరోజు రాత్రి చింతపూర్ణిమలో మరో 3 రాత్రులు కాట్రా వైష్ణోదేవి లో ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్న యాత్రికులకు తెలియని పెద్ద విశేశం,పెద్ద బహుమానం  ఈ యాత్రలో ఏమంటే  అమర్ నాధ్ తరువాత అంతటి మిని అమర్ నాధ్ క్షేత్రమైన శివకోరికి కూడా ఈ యాత్రలో వెళుతున్నాం.అందుకే కాట్రాలోనే 3రోజుల స్టే ఉంటున్నాము.శివకోరికి విడిగా వెళ్ళాలంటే( కాట్రా నుండి 100 కి.మీ.) మరో 5000 ఖర్చు అయ్యేది మీకు అదనంగా, ఏ ఖర్చు లేకుండా ఈయాత్రలోనే ఆ శివుడు పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటాం.ఇందుకు షాద్ నగర్ నుండి వచ్చే శరణప్ప,రాజు గారి గ్రూపు ముఖ్య కారణం.యాత్రలో ముందుగా లేని శివకోరి యాత్రలో వీరి ఉత్సాహంతో ఆయాత్రను ఆడ్ చేయడం వలన మొదటి రోజు కొంచెం టైం కంజెస్ట్ డ్ గా ఉంటుంది.తరువాత నుండి మాములుగా నడుస్తుంది.ఈ యాత్రలోనే అధనం ఖర్చులేకుండా శివకోరి కూడా దర్శనం చేసుకోవడం లో  వీరిగ్రూపుకు మిగితా యాత్రికులు ధన్యవాధములు తెలియచేయాలి.శివకోరిలో  ఇక్కడ కొండపైకి 3కి.మీ. ట్రెక్కింగ్ వెళ్ళాలి.నడిచిగాని గుర్రం పైన లేదా డోలి మీద వెళ్ళవచ్చును.

అలాగే ఈమద్య వార్తల లోకి వచ్చిన బ్యాటరి తయారికి ఉపయోగించే లిథయం నిక్షేపాలు ఉన్న ఏరియా జమ్ము కాశ్మీర్ లోని సలాల్ గ్రామం గురించే అంతా వినే ఉంటారు. మనం వెళ్ళే యాత్రలో చినాబ్ రివర్ పక్కన బాబా సయిద్ వాటర్ ఫాల్స్ దగ్గర లోనే ఈ గ్రామం నది అవతల వైపు ఉంటుంది.  

*)            డాక్యుమెంట్స్..  ప్రతి ఒక్కరు తప్పని సరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకోవలెను. దాంతోపాటు 2 జిరాక్స్ కాపీలు కూడా తెచ్చుకోవలెను(జిరాక్స్ కాపీలు హోటల్ రూం కోసం,)ఒరిజినల్ ఆదార్ కార్డ్ ఏయిర్ పోర్టులో సెక్యూరిటి చెకింగ్ కోసం,ట్రైన్ జర్నీ సమయంలో తప్పని సరిగా దగ్గర ఉంచుకోవాలి.

అలాగే వాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ జిరాక్స్ కాపి 2 సెట్లు దగ్గర పెటుకోంటే మరి మంచిది. ,మాస్కులు,శానిటైజర్ తెచ్చుకోగలరు.

*) *) https://selfregistration.cowin.gov.in/    ఈ లింక్ ఓపెన్ చేసిన తరువాత, మీరు వాక్సిన్ వేసుకున్నప్పటి మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేయండి. ఓ.టి.పి.వస్తుంది.ఎంటర్ చేయండి. అక్కడ మీ వాక్సిన్ సర్టిఫికెట్ కనపడుతుంది,పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోండి.

*)            మొబైల్ పవర్ బ్యాంక్ జాగ్రత్త.  ఫ్లైట్ లో మీరు మొబైల్ పవర్ బ్యాంకు తెచ్చుకుంటే ఎట్టిపరిస్థిల్లోను చెకిన్ లగేజిలో పెట్టవద్దు. తప్పనిసరిగా మీతో పాటే దగ్గర పర్సనల్ బ్యాగులో పెట్టుకోండి, సెక్యూరిటి చెక్ లో చెక్ చేయించుకోండి.

*)            సెక్యూరిటి చెకిన్ . బోర్డింగ్ పాసు తీసుకోగానే అంతా సెక్యూరిటి చెక్ఇన్ కు నిలబడి చెక్ చేయించుకోవాలి.ఈ ప్రాసెస్ సుమారుగా గంట ,గంటన్నర ఉంటుంది. ఏయిర్ పోర్టులో ప్యాసెంజెర్స్ ఎక్కువ ఉంటే ఒక్కోసారి 2గంటలు  కూడా పడుతుంది.అందుకే మన ఫ్లైట్ 10గంటలకు అంటే అర్థం ఏయిర్ పోర్టుకు 10గంటలకు రావడం కాదు, ఈ ప్రాసెస్ అంతా జరుగడానికి 2-3గంటల టైమ్ పడుతుంది కాబట్టే  అంతా 2-2.30 గంటల ముందు అంతా ఏయిర్ పోర్టుకు రావాలని(శ్రీటూర్స్ తరుపున) మరీ మరి చెప్పేది .సెక్యూరిటి చెక్ ఇన్ లో మీ హ్యండ్ బ్యాగ్ , నడుంకు ఉన్న బెల్ట్ ,మనీ పర్స్ ఒంటిమీద డ్రెస్ తప్ప మరేమి లేకుండా ట్రేలో పెట్టి సెక్యూరిటి స్కానర్ లోకి పంపాలి.మీ లగేజిని,మిమ్మల్ని మెటల్ డిటెక్టర్ తో సహా క్షుణ్ణంగా చెక్ చేసి,మీ బోర్డింగ్ పాస్ ను స్కాన్ చేసి లేదా స్టాంపింగ్ వేసి పోలీసులు లోపలికి పంపిస్తారు.

*)            ఆలస్యం చేయకుండా  ఫ్లైట్ ఎక్కడం. మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేప్పుడు దాంట్లో మీరు కూర్చునే సీటు నెంబర్ అలాగే గేట్ నెంబర్ కూడా ప్రింట్ చేసి ఇస్తారు.ఏ  గేట్ నెంబర్ కు ఇచ్చారో మీ బోర్డింగ్ పాస్ మీద  చూసుకుని ఆగేట్ దగ్గరకు వెళ్ళి వేయిట్ చేయాలి.లోపల కూడా వాష్ రూంస్ ఉంటాయి. బోర్డింగ్ పాస్ ఇచ్చారు,సెక్యూరిటి చెక్ ఇన్ ఐపోయింది హమ్మయ్య ఇక ఎప్పడైనా ఫ్లైట్ ఎక్కవచ్చును  అని అక్కడ కనపడే షాపుల్లో చూస్తూ తిరగవద్దు.భవిష్యత్తులో ఏ ఫ్లైట్ ఎక్కేప్పుడు కూడా(డొమెస్టిక్ దేశీయ సర్వీసుల్లో) బోర్డింగ్ పాస్ తీసుకుని,సెక్యూరిటి చెక్ అయ్యాక కూడా  ఖచ్చితంగా  30 నిమిషాల ముందే మీ ఫ్లైట్ కు అలాట చేసిన గేట్ దగ్గరకు చేరుకోవాలి.మీ బోర్డింగ్ పాస్ చేక్ చేసి ఫ్లైట్ లోకి అనుమతించాక,లగేజి సర్దుకుని సీట్లోకూర్చుని, ఫ్టైట్ సెక్యూరిటి సూచనలు విని,రన్ వేమీద విమానం రెడిగా పెట్టి టెకాఫ్ కావడానికి ఈ 30 నిమిషాల టైమ్ పడుతుంది. ఉదా ఉదయం .6.35 ఫ్లైట్ అంటే అది రన్ వే మీద ఫ్లైట్  టెకాఫ్ అయ్యే టైం అని అర్థం అంతే కాని మీరు విమానంలో కూర్చునే సమయం కాదు.ట్రైన్ లో మాదిరిగా బయలుదేరేముందు నిమిషం వరకు కూడా వెళ్ళడం ఎట్టిపరిస్థితుల్లో కూడా సాధ్యంకాదు.టైంకు ప్లైట్ బయలు దేరకుంటే ఆ ఏయిర్ లైన్స్ మీద కూడా హెవిగా ఫెనాల్టి చార్జీలు పడుతుంటాయి కాబట్టి  లేట్ గా వచ్చే ఎవరికోసం కూడా ఫ్లైట్ కొద్దిసేపు ఆపడం జరగదు.కాబట్టి అందరు ఈ జాగ్రత్తలు పాటించి టైంకు ఏయిర్ పోర్టుకు 2.30గంటల ముందే రాగలరని మనవి.

*టూర్ లో ఉన్నప్పుడు చాలామంది చేసే పొరపాటు తరువాత వెళ్ళేప్రదేశం,టెంపుల్ ఎన్నిగంటల్లో ఎప్పటికి వెళుతాం అని అడుగుతుంటారు.ఏ టూర్ లో కూడా ఈ ఆలోచన దొరణికి పుల్ స్టాప్ పెట్టాల్సిందే.మనం వెళ్ళేప్రదేశం , చూస్తున్న  ప్రదేశం భవిష్యత్తులో మళ్ళీ చూస్తారో చూడరో,వెళుతారో వెళ్ళరో , కాబట్టి ప్రతిక్షణం చూస్తున్న ప్రదేశం అక్కడి భౌగోళిక పరిస్థితులు,వాతవరణం,నధులు,వాగులు, వంకలు, రోడ్లు,పర్వతాలు, బిల్డింగులు ప్రతీది చూసి అనందించదగ్గదే అనిగుర్తుంచుకుంటే మీకు ప్రయాణం మధ్యలో ఎప్పుడు బోర్ కొట్టదు.మీరు టూర్ కు బయలుదేరి ఫ్లైట్ ఎక్కేముందే మీ సమస్యలు ఏమున్నా మూట కట్టి బయట విసిరి పారేయండి,యాత్రను సంపూర్ణంగా ఆనందించండి.

చివరగా బస్ లో శరణప్ప,రాజు గారి గ్రూపే సగం మంది ఉన్న కారణంగా బస్ లో సీట్ల అరెంజ్ మెంట్ ఇలా ఉంటుంది.బస్ 2×3 seater bus. బస్ లో సీట్లో కూర్చేనే విధానం మొదటి రోజు అమ్రుత్ సర్ ఏయిర్ పోర్టులో దిగాక చార్టులో ఉన్న యాత్రికుల సంఖ్య లో 1వనెంబర్ నుండి 21వరకు బస్ అదే సీరియల్ ప్రకారం బస్ లో మొదటి హఫ్ లో కూర్చోవాలి.. 22వ సీరియల్ రాజు గారినుండి 41వ సీరియల్ వరకు బస్ సెకండ్ హాఫ్ లో వెనుక కూర్చోవాలి…2వరోజు రివర్స్ బస్ లో సెకండాఫ్ లో వెనుక కూర్చున్న వారు పస్ట్ హాఫ్ లోకి ముందుకు వస్తారు.మొదటిరోజు బస్ లో పస్ట్ హాఫ్ లో కూర్చున్న వారు (1-21)2వరోజు బస్ లో సెకాండ్ హఫ్ లోకి వెనక్కి వెళ్ళలి…అలా ఒక రోజు ముందు ఒక రోజు వెనుక రిపీట్ అవుతుంది…అందరికి విన్నపం ఏమంటే స్కూల్ పిల్లల మాదిరిగా బస్ లో సీట్ల విషయం గొడవ పడకుండా కొంచెం సహనంతో కూర్చోగలరని మనవి, సీట్లు విషయంలో మీరు మీరు గొడవపడితే దయచేసి మద్యలో నన్ను దూర్చవద్దు..యాత్ర అన్ని రోజులు అంతా ఒకే కుటుంబ సభ్యులం అని అహ్లదంగా , ఆనందంగా యాత్ర పూర్తి చేసుకుని యాత్ర గురించి జివితాంతం గుర్తుండే  మధుర స్మ్రుతులతో తిరిగి రావాలి కాని సీట్ల దగ్గరో మరొ దగ్గర దయచేసి ఎవరు  గొడవలు పెట్టుకోవద్దు,ఇతరుల మూడ్ పాడుచేయవద్దు.

ఓం నమశ్శివాయ..  సర్వజన సుఖినోభవంతు..

శ్రీటూర్ , రవీందర్, 8985246542

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *